Sunday, April 28, 2024
- Advertisement -

ఏపీలో కొన‌సాగుతున్న బంధ్‌…జ‌న‌సేన‌, వైసీపీ దూరం

- Advertisement -

ఏపీకీ కేంద్రం చేసిన అన్యాయానికి నిరస‌న‌గా రాష్ట్రంలో త‌ల‌పెట్టిన బంద్ కొన‌సాగుతోంది. బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయిన మొద‌టిరోజు టీడీపీ, ప్ర‌జాసంఘాలు బంద్‌కు పిల‌పు నిచ్చాయి. ఉద్యోగ, ప్రజా సంగాలు మద్దతు పలికాయి. అయితే వైసీపీ, జనసేన, బీజేపీ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. మరోవైపు బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు సంఘీభావంగా సీఎం చంద్రబాబు… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరుకావాలని పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో కూడా టీడీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో పాల్గొననున్నారు.

ఈ బంద్‌కు జ‌న‌సేన‌, వైసీపీ దూరంగా ఉన్నాయి. భాజాపాతో నాలుగుసంవ‌త్స‌రాలు క‌ల‌సి ఉండి తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్యోక‌హోదాకోసం నాట‌కాల‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బంద్‌లో పాల్గొన‌కూడాద‌ని జ‌న‌సేన నిర్ణ‌యించింది. శుక్ర‌వారం నుండి ఈ నెల 12 వ తేదీ వ‌ర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. 11న ఢిల్లీలో ముఖ్య‌మంత్రి నాయ‌క‌త్వంలో నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -