Thursday, May 2, 2024
- Advertisement -

హైప‌ర్ ఆదికి యాక్సిడెంట్ న్యూస్ ఫేక్‌

- Advertisement -

ఈటీవీ ఛానెల‌లో ప్ర‌సార‌మ‌య్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే.ఈ షో ద్వారా చాలామంది ఆర్టిస్ట్‌లు ప‌లు సినిమాల‌లో ఛాన్స్‌లు కొట్టేయ‌డం మ‌నం చూస్తునే ఉన్నాం.ఈ షో నుంచి సినిమాలకి వెళ్లినవాళ్లు చాలామందే వున్నారు. ష‌క‌ల‌క శంక‌ర్‌,ధ‌న‌రాజ్‌,చలాకీ చంటి,ఇలా చాలామంది ‘జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు సినిమాల‌లో న‌టిస్తున్నారు.జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ లీడర్ గా కనిపించేవాడు. మొద‌ట్లో అదిరే అభి టీంలో ప‌ని చేసిన చేసిన హైపర్ ఆది త‌రువాత కాలంలో టీం లీడ‌ర్‌గా మారి బాగానే పాపుల‌ర్ అయ్యాడు. జబర్దస్త్ షో ఆది స్కీట్‌లకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.మ‌రి అలాంటి ఆది గ‌త కొన్ని రోజులుగా జబర్దస్త్ షో లో క‌నిపించ‌డం లేదు.ఆది జబర్దస్త్ షోలో ఎందుకు క‌నిపించ‌డంలేద‌నే దాని గురించి పెద్ద చ‌ర్చ న‌డ‌స్తుంది.

దాంతో ఈ విషయంపై ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.హైప‌ర్ ఆదికి యాక్సిడెంట్‌ అయింద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని ఆద్యా మీడియా ముందే చెప్పింది. ఆదికి యాక్సిడెంట్‌కు జ‌రిగింద‌నే వార్త‌ల‌పై విచార‌ణ చేసిన ఆద్యా మీడియా,ఇది ఊట్టి ఫేక్ అని వార్త తెల్చింది.హైప‌ర్ ఆదికి కాల్ చేసి మాట్లాడింది.యాక్సిండెట్‌పై ఆదిని అడగ్గా అలాంటిది ఏమి లేద‌ని,సినిమాల‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌నే ‘జబర్దస్త్’ షోకి రావ‌డం లేద‌ని తెలిపాడు.సినిమా షూటింగ్‌లు పూర్తి అవ్వ‌గానే తిరిగి ‘జబర్దస్త్’ షోలో రీ – ఎంట్రీ ఇస్తాన‌ని చెప్పుకొచ్చాడు.దీనిని బ‌ట్టి హైప‌ర్ ఆదికి యాక్సిండెంట్ జ‌రిగింద‌నే వార్త ఫేక్ అని ఆద్యా మీడియా తెల్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -