- Advertisement -

మంత్రి ప‌ద‌వి కాదు క‌దా…క‌నీసం సీటుకు కూడా దిక్కులేదు…

- Advertisement -

అదృష్టం ఉంటే ఎలాంటి ప‌ద‌వులైనా వెత్తుక్కుటూ వ‌స్తాయి. ల‌క్ లేక‌పోతే వెంట‌ప‌డినా ఎలాంటి ప‌ద‌వులు రావు. అన్ని ఉన్నా కాలం క‌ల‌సి రావాలి. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి అలాటే ఉంది. వైసీపీ త‌రుపున గెలిచి అభివృద్దికోసం అని పార్టీ మారిన ఫిరాయింపు నేత‌ల‌కు ఇప్పుడు దిమ్మ‌తిరిగి బొమ్మ‌క‌నిపిస్తోంది.

విశాఖ జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వ‌రి, కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు. మావోయిస్టుల చేతిలో కిడారి హ‌త్య‌కు గుర‌య్యిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఎట్లొచ్చి గిడ్డి ఈశ్వ‌రి ప‌రిస్థితే అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. ఎందుకంటే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవ‌డంతో ప‌చ్చ‌త‌మ్ముళ్ల కొంప కొల్లేర‌య్యేట్లు ఉంది.

పొత్తులో భాగంగా తెలుగు త‌మ్ముళ్లు కొన్ని సీట్లు వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. విశాఖ వరకూ తీసుకుంటే రెండు ఎమ్మెల్యే సీట్లను తమ్ముళ్ళు పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందే. అదే జరిగితే సిట్టింగులతో పాటు ఆశావహులు కూడా ఇంట్లో కూర్చోకతప్పని ప‌రిస్థితి.

పొత్తులో భాగంగా సిట్టింగులలో ఇద్దరికి సినిమా ఇపుడు తెర ముందు కనిపిస్తున్నారు. ఈ రెండు సీట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ , మరొకరు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీటుకు పొత్తులో భాగంగా ఎసరు వచ్చేలా ఉంది. ఈ సీటును కాంగ్రెస్‌కు ఇవ్వాల‌సిన ప‌రిస్థితి ఉంది. ఈ సీటు నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్ పోటీ చేస్తారని అంటున్నారు. దీంతో వాసుపల్లి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

మ‌రో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి ఈ సారి టీడీపీ త‌రుపున సీటు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపంచ‌డంలేదు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పసుపులేటి బాలరాజు పోటీకి సిధ్ధపడుతున్నారు. ఆయనకు కూడా కన్ ఫర్మ్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అదే జ‌రిగితే గిడ్డి ఈశ్వ‌రికి బిగ్ షాక్ త‌గిలిన‌ట్లే.

నిజానికి వైసీపీలోనే ఉంటే మ‌రో సారి ఈశ్వ‌రికి ఎమ్మెల్యే సీటుతో పాటు విజ‌యం కూడా లాంఛ‌న‌మే. పార్టీ అధికారంలోకి వ‌స్తే ఈశ్వ‌రికి మంత్రి ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశం ఉండేది. ఇప్పుడు చూసుకుంటే గిడ్డి ఈశ్వ‌రి సీన్ రివ‌ర్స్ అవ‌డంతో అనుచ‌రులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఒక వేల టీడీపీ నుంచి సీటు రాక‌పోతే ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -