Friday, May 10, 2024
- Advertisement -

చిరంజీవితో క‌లిసి క్లాప్ కొట్టిన హ‌రికృష్ణ‌

- Advertisement -

బాహుబ‌లి తరువాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న RRR (వ‌ర్కింగ్ టైటిల్‌) నిన్న‌(ఆదివారం) అట్ట‌హాసంగా ప్రారంభమైంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ,యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు,హీరో ప్ర‌భాస్‌,రానా,ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్రరావు  హాజ‌రైయ్యారు. సినిమా ముహార్త‌పు షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టారు.అయితే స‌డ‌న్‌గా ఈ సినిమా ఓపెనింగ్ షాట్‌లో దివంగ‌త నటుడు ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ ప్ర‌త్య‌క్షం అయ్యారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు హ‌రికృష్ణ కూడా  క్లాప్ కొట్టినట్లు ఉంది ఈ ఫోటోలో.

ఈ ఫోటో చూసి చాలామంది షాక్ అయ్యారు.అయితే  ఈ ఫోటోలో చిరంజీవితో పాటు హరికృష్ణ ఫోటోని ఎవ‌రో అభిమాని మార్ఫింగ్ చేశార‌ని తెలుస్తుంది.హ‌రికృష్ణ అచ్చం బ్ర‌తికి ఉన్న‌ట్లు చిరంజీవితో క‌లిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన‌ట్లు డిజైన్ చేయ‌డం ప‌ట్ల హీరో మంచు మ‌నోజ్ ఆనందం వ్య‌క్తం చేస్తు ఈ ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్‌లో చేశాడు. RRR  సినిమా సూప‌ర్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు మంచు మ‌నోజ్‌.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -