Friday, May 17, 2024
- Advertisement -

మోదీ తిరుగులేని నేత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు…. కాని…?

- Advertisement -

స‌ర్వేల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా భాజాపా, మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో భాజాపాకు వ‌చ్చిన లోక్ స‌భ‌స్థానాలు 2019 రావ‌డం క‌ష్ట‌మ‌ని బాంబు పేల్చారు. మ‌రో సారి అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం అంత సుల‌భం కాద‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు. పీకే చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ప్రధాని మోదీ తిరుగులేని నేత అని చెప్పడంలో అతిశయోక్తి లేదని… కానీ, ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ సత్తా చాటలేదని అన్నారు. గత ఎన్నికల్లో కన్నా మెజార్టీ తక్కువ రానున్నప్పటికీ… బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరించి ఇత‌ర పార్టీల స‌హాయంతో అధికారంలోకి వ‌స్తుంద‌ని జ్యోష్యం చెప్పారు.

జేడీయూ చిన్న పార్టీయే అయినా దానికి ఇబ్బందికర చరిత్ర లేకపోవడం తనను ఆకర్షించిందని అన్నారు. జేడీయూ అభ్యర్థుల సగటు వయసును 45 ఏళ్లకు తగ్గించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ‘‘నా లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు బీజేపీయే ముందుంద‌న్నారు. ఎన్నికల్లో గెలవాలన్నా ఓడాలన్నా చివరి 10-12 రోజులే కీలకమని నా పన్నెండేళ్ల అనుభవం చెబుతోంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌న‌ర్హం . ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీదే అధికారం.

ప్రతిపక్షం బలమైనదా, కాదా అనే దానికన్నా ఇతర అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని పీకే తెలిపారు. దేశంలో 70శాతం ప్రజల దినసరి ఆదాయం వంద రూపాయలు కూడా లేదు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు. అందుకే దేశంలో ప్రతీ ఎన్నికలూ నాయకులకు షాక్‌ ఇస్తుంటాయి’’ అని చెప్పా రు. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -