Wednesday, April 24, 2024
- Advertisement -

తప్ప తాగి హీరోయిన్‌తో మిస్ బిహేవ్ చేశాడా..?

- Advertisement -

బాలివుడ్ నటి రవీనా టాండన్ కొద్ది రోజుల కిందట ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనటానికి లాస్‌ ఏంజల్స్‌ వెళ్ళింది. అక్కడ మూడు రోజుల సెలబ్రేషన్స్‌లో పాల్గొందట. మొదటి రెండు రోజులు బాగా ఎంజాయ్ చేశారు.

చివరి రోజు మాత్రం రవీనా టాండన్‌పై ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవరించాడని సమాచారం. అలా ప్రవర్తించడమే కాకుండా బాగా తాగి ఆమెపై బూతు పురాణం చేశాడట. ఇక్కడ విశేషమేంటంటే అలా చేసిన వ్యక్తి ఎవరో కాదు ఆ ఫంక్షన్ కు ఆర్గనైజర్ గా వ్వవహరిస్తున్న వ్యక్తే. తర్వాత ఎందుకిలా ప్రవరించాడని అక్కడి వారు విచారిస్తే.. రవీనా టాండన్ ఆ ఆర్గనైజర్ పిల్లలను కారులో ఎక్కించుకోక పోవడమే ఇందుకు కారణమని తెలిసింది.

అతను చెప్పిన విధానం ప్రకారం… అతని కారు సెక్యూరిటి వారు లోపలికి అనుమతించక పోవటంతో ఎదురుగా వస్తున్న కారును ఆ ఆర్గనైజర్ ఆపాడట. అదే కారులో రవీనా టాండన్ ఫంక్షన్‌కి వెళుతోంది. కారును ఆపిన తర్వాత అందులో తన పిల్లలని లోపలికి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేశాడట. రవీనా టాండన్ దీనికి ససేమిరా అనడంతో, తర్వాత ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఆ రకంగా ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి పైశాచిక ఆనందాన్ని పొందినట్లు తెలుస్తోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -