- Advertisement -

టాక్సీక్ ఫ్యాన్స్ కి నిరాశే!

- Advertisement -

టీజర్‌తో అంచనాలను పెంచేసిన టాక్సిక్ … ఫస్ట్ సింగిల్‌ నిరాశపర్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రీసెంట్‌గా విడుదలైన తొలి సింగిల్ తబాహి అభిమానులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.

సాధారణంగా లిరికల్ వీడియోతో పాటు సినిమా సన్నివేశాల కొన్ని చూపిస్తారని అభిమానులు భావించారు. కానీ మేకర్స్ కేవలం ఆడియో ట్రాక్‌ను స్టాటిక్ ఆల్బమ్ కవర్‌తో మాత్రమే విడుదల చేశారు. దీంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గడియారం ఎమోజీతో పాటు “తబాహీ” పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. రాత్రి 10:10 గంటలకు వీడియో సాంగ్ విడుదల అవుతుందనే సంకేతమని చాలామంది భావించారు. అది జరగకపోవడంతో మరుసటి రోజు ఉదయం 10:10కి వస్తుందేమోనని ఊహించారు. కానీ సాంగ్ రిలీజ్ కాకపోవడంతో అభిమానులు నిరాశచెందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -