Friday, April 26, 2024
- Advertisement -

సినిమాల‌కు బై..బై చెప్పేస్తున్న ‘రామ్-ల‌క్ష్మ‌ణ్’

- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఓ ఫైట్ మాస్టర్ పేరు చెప్ప‌మంటే అంద‌రు ఠ‌క్కున చేప్పే పేర్లు రామ్‌,ల‌క్ష్మ‌ణ్‌.తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ బాష‌ల‌లో ఎన్నో సినిమాల‌కు ఫైట్ మాస్ట‌ర్స్‌గా ప‌నిచేసిన రామ్‌,ల‌క్ష్మ‌ణ్‌లు త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నార‌ట‌.ఈ విష‌యాన్ని వారే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం జ‌రిగింది. 1100 సినిమాలకు పైగా పనిచేశామని తమకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయని అన్నారు.

దాదాపు తెలుగు హీరోలందరికీ ఫైట్ మాస్టర్స్ గా పని చేసిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం మహేష్ బాబు, చిరు 151వ సినిమాకు పని చేస్తున్నట్లు వెల్లడించారు.మేము ఇంత‌టి స‌క్సెస్ కావ‌డానికి ప్ర‌తి హీరో కార‌ణ‌మని ,కాని మాకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్ప‌డానికి చాలా గ‌ర్వంగా ఉంద‌ని ఆయ‌న‌తోనే మేము ఎక్కువ సినిమాలు చేశామ‌ని తెలిపారు ఈ ఇద్దరు అన్నదమ్ములు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -