Thursday, May 2, 2024
- Advertisement -

ఖ‌రీదైన న‌గ‌లు చూపించ‌డ‌మే ఆ గ‌ర్భిని పాలిట‌ శాపంగా మారిందా…?

- Advertisement -

బంగారు న‌గ‌లు , ఖ‌రీదైన బ‌ట్టు చూపించ‌డ‌మే నిండు గ‌ర్భిని పాలిట శాపంగా మారింది. చివ‌ర‌కు సూట్‌కేస్‌లోనే మృత‌దేహం తేలింది. పొరుగు మ‌హిళే క‌దా అని ఖ‌రీదైన న‌గ‌లు, దుస్తులు చూపించింది దాన్ని చూపించింది. ఆన‌గ‌ల‌కు ఆశ‌ప‌డి గర్భిణి మహిళను హత్య కేసి, ఆపై సూట్‌కేసులో కుక్కిపడేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

దివాకర్, రితూ అనే దంపతులిద్దరూ నోయిడాలోని బిస్రాఖ్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటికి ఎదురుగా ఉన్న గదిలోకి.. నవదంపతులు శివమ్, మాల కొత్తగా వచ్చారు. అయితే మాల ఇంటికి వారి బంధువులు గురువారం మధ్యాహ్నం వచ్చారు. ఇక ఇంటికొచ్చిన చుట్టాలకు మాల తనకున్న బంగారు ఆభరణాలు, దుస్తులను చూపించింది.

ఆ సమయంలో పొరిగింట్లో ఉన్న రితూ అనే మహిళ నగలపై కన్నేసింది. ఇంటికి వెళ్లి రితూ ఆమె భర్త సౌరభ్‌ దివాకర్‌కు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇద్దరూ కలిసి నగలు ఎలాగైనా కాజేయాలని పన్నాగం పన్నారు. మరుసటి రోజు మాలా భర్త శివం ఇంట్లో లేని సమయం చూసి రీతూ దంపతులు తమ ఇంటికి ఆహ్వానించేందుకని వెళ్లారు.

ముందుగా తాము రచించిన పథకాన్ని అమలుచేస్తూ భార్య,భర్తలిద్దరూ కలిసి మాలాను గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆమె సూట్‌కేసులో దాచుకొన్న నగలను, సెల్‌ఫోన్‌ తీసుకొని మృతదేహాన్ని అదే సూట్‌కేసులో కుక్కిపెట్టారు. రాత్రి 9గంటల ప్రాంతంలో మృతదేహాం ఉన్న సూట్‌కేసు తీసుకొని ఘజియాబాద్‌కు సమీపంలోని ఇందిరాపురంలో పడేశారు. మృతదేహాన్ని తీసుకొని దివాకర్ ఇందిరాపురం వెళ్లగా.. రితూ తన మేనమామ ఇంటికెళ్లింది. మాల అదృశ్యంపై బిస్రాఖ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే సూట్‌కేసులో ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు అదే రోజు పోలీసులకు సమాచారం అందించారు.

అంతకుముందే ఓ మహిళ మృతదేహం ఉన్న సూట్‌కేసు కనిపించిందని ఫిర్యాదు అందింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలతో మృతదేహం ఆనవాళ్లు సరిపోలడంతో సూట్‌కేసులో ఉన్న మృతదేహం మాలాదేనని గుర్తించామని గౌతమ్‌ బుద్ధనగర్‌ సీనియర్‌ ఎస్పీ అజయ్‌పాల్‌ శర్మ తెలిపారు.

తమ కుమార్తెను వరకట్నం కోసం శివమ్ కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ జరపగా.. ఈ ఘటన జరిగిన సమయంలో శివమ్ తన డ్యూటీలో ఉన్నట్లు తేలింది.

ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో.. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మొత్తానికి మాలను తామే హత్య చేసినట్లు దివాకర్, రితూ ఒప్పుకున్నారు. బంగారు ఆభరణాలు, దుస్తులు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -