Friday, May 17, 2024
- Advertisement -

సినీనటుడు మాదాల రవి అరెస్ట్

- Advertisement -

వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో నటుడు మాదాల రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు కుమారుడైన రవి, వృత్తి రీత్యా డాక్టర్‌గా పనిచేస్తూ.. సినీ పరిశ్రమలోనూ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇతనికి అంతకుముందే పెళ్లై ఉన్నా కూడా ఓ యువతిని ప్రేమలోకి దింపి కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు. తాజాగా ఇతడి నిర్వాకం తెలిసిన ఆ యువతి వేరొకరితో పెళ్లికి సిద్ధమైంది.

ఇది సహించలేని రవి, ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో గతంలో దిగిన వ్యక్తిగత ఫోటోలను చూపి బ్లాక్‌మెయిల్ చేయసాగాడు.

ఈ వేధింపులు తట్టుకోలేక ఆ యువతి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. మాదాల రవిని అరెస్ట్ చేశారు. రవి తరపు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -