Wednesday, May 15, 2024
- Advertisement -

నిర్మాతల హీరోగా అడివి శేష్

- Advertisement -

ఈ మధ్యకాలంలో ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మరొక సినిమాతో డిజాస్టర్ లు అందుకుంటున్న హీరోలు ఉన్నారు కానీ వరుసగా మంచి విజయాలను సాధించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మొదటి పేరు అడవి శేష్. ‘క్షణం’ సినిమా నుంచి ఈమధ్యనే విడుదలైన ‘ఎవరు’ దాకా అడవి శేష్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇది మామూలు విషయం అయితే కాదు. దీంతో అడవి శేష్ కి మినిమం గ్యారెంటీ హీరో అనే పేరు వచ్చేసింది. ప్రస్తుతం అందరూ నిర్మాతల కన్ను అడివి శేష్ పైనే ఉంది.

పైగా సినిమాల విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు అడివి శేష్. ఇది ఇప్పుడు తనకి చాలా ప్లస్ అయింది. అడవి శేషు నిర్మాతలతో ఎక్కువగా ఖర్చు పెట్టించే రకం కాదు. బడ్జెట్ కి మించి సినిమాలు చేసిన దాఖలాలు లేవు. దీంతో దాదాపు అన్ని సినిమాల తోనూ సేఫ్ సైడ్ లోకి నిర్మాతలు వెళ్లిపోతున్నారు. ప్రతి సినిమాతోనూ శేష్ తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. దీంతో నిర్మాతలు, దర్శకులు కూడా అడివి శేష్ తో సినిమాకోసం క్యూ కట్టేస్తున్నారు. ఏదేమైనా అడివి శేష్ మాత్రం క్వాలిటీ సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -