Sunday, May 5, 2024
- Advertisement -

సాయంత్రం అర‌వింద స‌మేత నుంచి అనగనగా .. ‘ లిరికల్ మొద‌టి సాంగ్ విడుద‌ల‌

- Advertisement -

జానియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం అర‌వింద స‌మేత‌. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబ‌ర్ 13న‌ విడుదల కానుంది. స్వాతంత్య్ర‌దినోత్సవ శుభాకాంక్ష‌ల‌తో టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో జ‌గ‌ప‌తి బాబు డైలాగ్స్‌, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న ఈ సినిమా నుంచి, ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ నెల 20న నోవాటెల్‌లో మూవీ ఆడియో వేడుక‌ని జ‌ర‌పాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌

అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. సెకండాఫ్ లో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఇది పూర్తి రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి తమన్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తుండ‌గా, పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -