Thursday, May 2, 2024
- Advertisement -

చిరుతో కొర‌టాల సినిమా లాంచ్‌కి మూహూర్తం ఖ‌రారు ..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా కొర‌టాల డైరెక్స‌న్‌లో చిరు న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు చిత్రపరిశ్రమలో రాజమౌళి తరువాత అపజయాలు ఎరుగని దర్శకుడిగా కొరటాల శివ పేరు వినిపిస్తుంది. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలతో కథలను సిద్ధం చేసుకోవడం ఆయన ప్రత్యేకత. వినోదానికి సందేశాన్ని జోడిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.

కొరటాల శివ తదుపరి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్త తెలియగానే సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొరటాల శివ చిరు కోసం ఓ సందేశాత్మక కథ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కథా పరంగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కొరటాల స్టైల్ లో కథ నడుస్తూనే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుందని సమాచారం. చిరంజీవి నుండి ప్రేక్షకులు ఆశించి మాస్ ఎలిమినేట్స్ అన్నీ ఈ కథలో ఉండేలా చూసుకుంటున్నాడు. చిరు మేనరిజమ్స్ తెరపై మరింత ఆకట్టుకునే విధంగా ప్రతి చిన్న డీటైల్ విషయంలో కేర్ తీసుకుంటున్నాడట

కొరటాల, చిరు మూవీ సంక్రాంతి రోజు ప్రారంభం కానున్నట్లు తాజగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి సినిమాని లాంచ్ చేసి ఆ తరువాత మరికొన్ని రోజుల్లోనే సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లేలా కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -