Tuesday, May 6, 2025
- Advertisement -

పవన్ మూవీలో పెంచల్ దాస్ పాట..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పాటల పై ప్రత్యేక అభిరుచి ఉంది. ఆయన సినిమాల్లో దేశభక్తి గీతాలు, ఫోక్ సాంగ్స్ తరచూ వినిపిస్తుంటాయి. బద్రిలో ‘ఐ యామ్ ఇండియన్’, ఖుషీలో ‘ఏ మే రాజహ’ సాంగ్స్ దేశభక్తి తో నిండినవే. అలాగే ఖుషీ సినిమాలో అలనాటి పాటైన ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే’ ఇష్టపడి మరీ పెట్టించుకున్నాడు పవన్ . అదే సినిమాలో పవన్ పాడిన ‘బై బై ఏ బంగారు రవణమ్మ’ ఫోక్ సాంగ్ అప్పట్లో అభిమానులను అలరించింది.

ఆ తర్వాత పవన్ పాడిన అత్తారింటికి దారేదిలో ‘కాటమ రాయుడా కదిరీ నరసింహుడా’, అజ్ఞాతవాసి సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు’ సాంగ్స్ అభిమానులను అలరించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ లో రాయలసీమ గాయకుడు పెంచల్ దాస్ తో ఓ ఫోక్ సాంగ్ పాడించనున్నట్లు సమాచారం. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం, అరవింద సమేత వీర రాఘవలో సిచ్యువేషన్ కు తగ్గట్టుగా పెంచల్ దాస్ పాడిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

అయ్యప్పనుమ్ కోషియమ్ లో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ నేపథ్య గీతాన్ని పెంచల్ దాస్ తో పాడించాలని ఆ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కీలకసమయంలో వచ్చే ఈ సాంగ్ పెంచల్ దాస్ పాడితే ఆ సాంగ్ కు వచ్చే రెస్పాన్స్ వేరే. అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను తెర మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -