Friday, March 29, 2024
- Advertisement -

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోలే. ఇద్దరూ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే పెద్ద స్టార్లుగా అవతరించారు. వీరిద్దరూ ఇమేజ్ లో ఎవరికి వారే సాటి. వీరిద్దరి జీవితంలో చాలా పోలికలే ఉన్నాయి. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. ఇద్దరూ వారి కెరీర్లో తమ తొలి నాలుగైదు సినిమాలతోనే సూపర్ స్టార్లుగా ఎదిగారు. 1996లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్, 99లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఇప్పటి దాకా ఇద్దరూ 26 సినిమాల్లోనే నటించారు.

వీరిద్దరూ ఎప్పుడు రెండేసి సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేసింది లేదు. ఏడాదికి ఒక్క సినిమా, రెండేళ్ల ఒక సినిమా లాగా చేసుకుంటూ వెళ్లారు. వీరిద్దరూ ఇప్పుడు కెరీర్లో తొలిసారిగా ఒకేసారి రెండేసి సినిమాల షూటింగులలో పాల్గొన బోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సమాంతరంగా డేట్లు ఇస్తూ పూర్తి చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే మలయాళ రీమేక్ సినిమాను పూర్తి చేసి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్నాడు.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా నూతన షెడ్యూల్ విదేశాల్లో జరగబోతోంది. అక్కడ షెడ్యూల్ పూర్తవగానే మహేష్ బాబు ఇండియాకు తిరిగి వచ్చి త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించనున్నారు. పరశురామ్, త్రివిక్రమ్ సినిమాలను మహేష్ బాబు సమాంతరంగా చేయనున్నాడు. అందుకోసం రెండు సినిమాలకు డేట్స్ కేటాయించనున్నాడు. మహేష్, పవన్ ఇలా వరుసగా సినిమాలు ఒప్పుకొని సమాంతరంగా సినిమాలు చేయడం ఇదే తొలిసారి. దీంతో వారి వారి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -