Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబ‌లికి ఎంత క‌ష్టమొచ్చింది

- Advertisement -

బాహుబలితో…. ఎవరెవరికి ఎంతటి ఇమేజ్ రావాలో అంతకంటే ఎక్కువ ఇమేజే  వచ్చేసింది.దీంతో ఎవరికివారు తమ తర్వాత వెంచర్స్  కు… డేట్స్ ఎడ్జెస్ట్ చేసే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు.కాని ఇక్కడ అందరి పరిస్థితి ఒకలా ఉంటే….

ప్రభాస్ పరిస్థితి మరోలా ఉంది. తన తర్వాతి చిత్రాలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఎంతగానో సతమతమైపోతున్నాడు.అయితే ప్రభాస్ పడుతోన్న ఈ ఇబ్బందికి

ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ చక్కని పరిష్కారం చూపెట్టింది.

.బాహుబలి ఇమేజ్ కు  కంటిన్యుటి తెచ్చేలా ఓ భారీ చిత్రానికే స్కెచ్ వేయాల‌ని ప్రభాస్ కు సూచిస్తోంది.ఫోర్బ్స్ మేగజైన్ చెబుతున్నదాని ప్రకారం …బాహుబలి క్రేజ్ ను ఉపయోగించుకుని ప్రభాస్ మరింత పైకెదగాలని చెబుతున్నట్లుంది.దీనికి హాలీవుడ్ సూపర్ స్టార్ హారిసన్ ఫోర్డ్ ను ఎక్జాంపుల్ గా చూపెడుతుంది.అతను స్టార్ వార్స్ ట్రయాలజీతో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని…. ఎంతో తెలివిగా తన కెరియర్ ను ప్లాన్ చేసుకున్నాడు.దాదాపు 40 ఏళ్ల పాటు  హీరోగా నిలబడి ఎన్నో మైలురాల్లను అందుకున్నాడు.చేసిన ప్రతి చిత్రం డిఫరంట్ జోనర్లో ఉండేలా ప్లాన్ చేశాడు.అందుకే సూపర్ స్టార్ గా అంతకాలం నిలబడ్డాడు.అదే రీతిలో ప్రబాస్ కూడా అడుగులు వేయాలని ఆ మేగజైన్ కోరింది.

అలాగే ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడంలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫేం ఎలిజా ఉడ్ ఏ తరహాలో రాంగ్ స్టెప్ వేసాడో చెప్పింది. ఎందుకంటే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తో వచ్చిన ఇమేజ్ ను ఎలిజా ఉడ్ కరెక్ట్ గా యూజ్ చేసుకోకుండా సీరియల్స్ లో యాక్ట్ చేసి అసవసరంగా తన ఇమేజ్ ను స్పాయిల్ చేసుకున్నాడు.అదే రీతిలో ఫాలో అయితే రేపన్న రోజు ప్రభాస్ ఇమేజ్ కూడా ఇలాగే మారుతుందని చెప్పింది.

ప్రభాస్ కున్న బాడీ చూస్తే గ్రీక్ శిల్పంలా ఉందని ఆ మ్యాగజైన్ ఓ కథనాన్ని ప్రచురించింది.దాన్ని అతను ఎలా మౌల్డ్ చేసుకుంటాడో అన్నట్లుగా ఇచ్చిన ఆర్టికల్….. ప్రభాస్ ను చాలా ఇబ్బంది పెట్టేలా చేసింది.అయినప్పటికీ క్రిటిక్స్ చెబుతున్నదాని ప్రకారం  ఇది మాత్రం వాస్తవం.ఇన్నేళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని  చూసిన ప్రభాస్ రేపన్న రోజు కొత్త చిత్రాల సెలెక్షన్లో మరింత ఆలోచనతో అడుగు ముందుకు వేయాలని

చెబుతోంది.మరి బాహుబలి కన్ క్లూజక్ వచ్చాక ప్రభాస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -