Monday, April 29, 2024
- Advertisement -

ఆ ముద్దుగుమ్మలు చెన్నై వ‌దిలి రానంటున్నారు

- Advertisement -

ఆ ముద్దుగుమ్మలంతా  టాలీవుడ్ పుణ్యమా అంటూ సక్సెస్ సాధించినవారే. కాకపోతే కోలీవుడ్ చిత్రాలతో ఒక స్టెప్ పైకెక్కారు.అలా అని చెప్పి టోటల్ గా టాలీవుడ్ ను వదిలేస్తానంటే కుదరదు కదా. కాని వారు అదే పని చేస్తామంటున్నారు. చేస్తున్నారు కూడా.

చెన్నైలోనే భాగుందంటూ టాలీవుడ్ కు రాకుండా…. అక్కడే కెరియర్ లాగించేస్తోన్నారు మ్యాట‌ర్లోకి వెళితే….. సౌత్ సుందరీమణులు తెలివి మీరిపోయారు.టాలీవుడ్లో అలా బ్రేక్ వచ్చిందో లేదో… కోలీవుడ్లో అలా వాలిపోతున్నారు. ఇది ముందునుంచి  ఉన్నదే. రాధ,విజయశాంతి,ఖుష్బూలందరూ…. ఇలా చేసి కాసులు సంపాదించినవారే.ఇలా చేసి కొందరు కోలీవుడ్లో సెటిలైతే…. ఇంకొందరు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ చిత్రాలను సమాంతరంగా చేస్తూ వచ్చారు. లేటెస్ట్ గా ఈ ట్రెండ్ కోలీవుడ్లో మళ్లీ మొదలైంది.

మొన్నటివరకూ ఇక్కడ హల్చల్ చేసిన కాజల్ ను వారు టోటల్ గా ఉంచేసుకున్నారు.క్యూట్ గాళ్ ను ఇవ్వమంటే ఇవ్వమంటూ మారం చేస్తున్నారు. చివరకు విజయ్ కూడా కాజల్ ని వదులుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

కాజల్ ను ఎలాగూ తమ ఓన్ చేసేసుకున్నారు కదా ….సమంతాతోనైనా సిత్రాలు చేద్దామనుకుంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. సమంతా డేట్స్ ను బల్క్ లో మరీ బుక్ చేసేసుకుంటూ …సమంతాను ఫుల్ బిజీ భామగా మార్చేశారు. తాప్సీ,బిందు మాధవి లాంటి హీరోయిన్లది కూడా ఇదే పరిస్థితి.వారిని కూడా ఎక్కడా కామ్ గా కూర్చోనీయడం లేదు.వీరికి అంత స్టార్ స్టేటస్ లేకపోయినప్పటికీ… తమిళ తంబీలు వీరిని వదులుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. చివరకు ఏదో ఒక రకంగా హారర్ చిత్రాల్లోను వీరిని బిజీ చేసేస్తున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా సైతం…. బాహుబలి హిట్ తర్వాత కోలీవుడ్ అగ్రహీరోలకు మరోసారి హాట్ టాపిక్ అయింది. అజిత్ ,విజయ్ ,సూర్యలతో పాటు మిగతా హీరోలు సైతం… తమన్నా మాక్కావాలంటే మాక్కావాలంటూ మారం చేస్తున్నారట. అసలే డేట్స్ లేక ఇబ్బంది పడుతోన్న తమన్నా..కోలీవుడ్ హీరోల ఒత్తిడిని తట్టుకోలేకపోతుందని సమాచారం. అలాగే తెలుగు చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్న హన్సిక,శ్రీదివ్యలు కూడా ఇపుడు అక్కడ నోటెడ్ హీరోయిన్లు అయిపోయారు.వీరు లేందే చిన్న ,మధ్య తరహా నిర్మాతలు చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

కోలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన బామలకు ఈడిమాండ్ ఉందంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. కాని అదేంటో ఏజ్డ్ బ్యాచ్ అయినటువంటి త్రిష,నయనతారలకు సైతం సినిమాలు మీద సినిమాలు ఇచ్చేస్తూ ఉండడంతో….  కోలీవుడ్ టాలీవుడ్ నోటెడ్ తారలతో క‌ళకళలాడిపోతోంది. అనుకున్నదానికంటే రెమ్యునిరేషన్ ఎక్కువగా వచ్చేస్తూ ఉండడంతో తమకు చెన్నై నే భాగుందంటూ భామలు అక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే కాబోలు రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్తోన్న మ‌న చిత్రాల్లో నటిస్తోన్న భామలంతా కొత్తవారు,లేటెస్ట్ గా క్లిక్ అయినవారే కనిపిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -