Thursday, May 2, 2024
- Advertisement -

కేటీఆర్ ట్వీట్‌కు మ‌హేష్ యాక్ష‌న్‌!

- Advertisement -

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ భరత్‌ అనే నేను రిలీజ్‌ తరువాత సీన్‌ మారిపోయింది. ఈ సినిమా చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మహేష్‌కు మంచి రిలేషన్‌ ఏర్పడింది. మహేష్ లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను ప్రమోషన్ ఈవెంట్లోనూ కేటీఆర్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు.మహేష్‌ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారని, నేను మాత్రం అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తానంటూ సరదాగా కామెంట్‌ చేశారు కేటీఆర్‌.

రీసెంట్ గా ఓ పబ్లిక్ ఈవెంట్ కు వెళ్లిన కేటీఆర్ అక్కడున్న యూత్ తో కలిసి సెల్ఫీ దిగారు. ‘‘ఇది నిజం.. కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను మహేష్‌కు ట్యాగ్‌ చేసిన కేటీఆర్‌ ‘హ..హ.. మహేష్ ఇది నీకోసమే’ అంటూ కామెంట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన మహేష్‌ ఓ స్మైలితో రిప్లై ఇచ్చారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -