Monday, April 29, 2024
- Advertisement -

అత‌నితో శృంగారం.. నా పొరపాటే!

- Advertisement -

నైటీ క్వీన్ అంటూ అర్షి ఖాన్ ను ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇందుకు కారణం, ఈ భామ బిగ్ బాస్ సీజన్ లో విపరీతంగా నైటీలు వాడేసి కనిపించడమే.మోడల్‌ కమ్‌ బాలీవుడ్‌ నటి అర్షి ఖాన్‌కి వివాదాలు కొత్తేం కాదు. తాన‌ను తానే హాట్ ఫిగ‌ర్ అని చెప్పుకునే వాళ్ల‌లో అర్షి ఖాన్ ముందువ‌రుస‌లో ఉంటుంది. బిగ్ బాస్‌తో బాగా ఫేమ‌స్ అయింది అర్షి.

మూడేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌తో మొదలైన ఆమె వివాదాల ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది.2015లో ఈమె చేసిన ఓ ట్వీట్ సెన్సేషనల్ అయిపోయింది. తాను పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో సెక్స్ చేశానని.. తామిద్దరం బాగా ఎంజాయ్ చేశామని.. అయినా తను ఎవరితో అయినా పడుకోవాలంటే.. అందుకు ఇండియన్ మీడియా అనుమతి తీసుకోవాలా అంటూ అర్షి ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్‌ గురించి ఆమె ఎక్కడా నోరు మెదపలేదు.

అర్షి తాజాగా ఓ ఛానెల్‌ చిట్‌ఛాట్‌ ప్రొగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్‌ ప్రస్తావన రాగా, ఆమె స్పందించారు. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్‌ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నా’ అంటూ అర్షి పేర్కొన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -