Sunday, April 28, 2024
- Advertisement -

గుంటూరు కారం..ఆగని రికార్డుల జోరు!

- Advertisement -

త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న వసూళ్ల పరంగా మాత్రం సత్తాచాటింది. ముఖ్యంగా సినిమాలోని కుర్చీ మడత పెడితే సాంగ్‌ ఆల్ టైం హిట్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు సైతం ఈ సినిమా పాటకు స్టెప్పులేశారంటే ఎంత రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిన ఈ పాట సునామీ మాత్రం ఆగడం లేదు. తాజాగా 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సౌత్ ఇండియా మూవీల్లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

100 మిలియన్ వ్యూస్ తో పాటుగా 1 మిలియన్ లైక్స్ రాబట్టి మరో రికార్డు క్రియేట్ చేసింది. తమన్ సంగీతం అందించగా మహేష్ బాబు – శ్రీలీల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. హారికా హాసిని ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -