- Advertisement -

గాయపడ్డ సింహం..అందరిని అలరించే కథ!

- Advertisement -

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న తరుణ్ భాస్కర్, ఈసారి రైటర్–డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ ఎంటర్టైనర్‌కు సిద్ధమయ్యారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు పవన్ సాదినేని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ కలిసి సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

‘గాయపడ్డ సింహం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికన్ శైలిలో ఎరుపు–తెలుపు రంగులతో రూపొందిన ఈ పోస్టర్‌లో, అమెరికా జెండాను గుర్తుచేసే నక్షత్రాలు, నిలువు గీతల బ్యాక్‌డ్రాప్‌లో దూసుకుపోతున్న విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాస్‌పోర్ట్ స్టాంప్ డిజైన్ కథలో అడ్వెంచర్‌తో పాటు సెటైరికల్ టచ్ ఉన్నట్లు స్పష్టంగా సూచిస్తోంది.

రివాల్వర్, డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న క్యారికేచర్, నటరాజ కాంపస్ బాక్స్ వంటి విజువల్స్ ఈ చిత్రం పొలిటికల్ సెటైర్, క్రైమ్, హాస్యం మేళవించిన ఎంటర్టైనర్ అని సంకేతాలిస్తాయి. “నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!” అనే ట్యాగ్‌లైన్ మరింత హిలేరియస్‌గా ఉంది. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 9న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ అందించగా, స్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్‌గా, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కథను సూర్య ప్రకాష్ జ్యోసుల అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -