- Advertisement -

పబ్‌జీ ఆడుతున్నారా..ఇది ఖచ్చితంగా మీకోసమే?

- Advertisement -

ఇటీవల యువతలో విపరీతంగా పెరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ అలవాట్లు ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహమ్మద్ కైఫ్ (22) పబ్‌జీ గేమ్‌కు తీవ్రంగా అలవాటు పడటం అతడి ప్రాణాలకే ముప్పుగా మారింది. గత నాలుగు నెలలుగా పబ్‌జీని గంటల తరబడి ఆడుతూ, నిద్రాహారాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న కైఫ్‌కు చివరకు అదే గేమ్ ప్రాణాంతకంగా మారింది.

శుక్రవారం రాత్రి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అర్ధరాత్రి వరకు పబ్‌జీ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా అతడు కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల అనంతరం మానసిక ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరడంతో బీపీ 300 దాటిందని, దాంతో మెదడులోని నరాలు చిట్లి భారీ రక్తస్రావం జరిగి మృతి చెందినట్లు వెల్లడించారు.

వైద్యుల మాటల్లో చెప్పాలంటే, నిరంతరంగా స్క్రీన్‌కు అతుక్కుపోయి గేమ్ ఆడటం వల్ల మెంటల్ స్ట్రెస్, నిద్రలేమి, అధిక ఉత్కంఠ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోటీ భావనతో కూడిన గేమ్స్ యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. ఈ ఘటన యువతతో పాటు తల్లిదండ్రులకు కూడా హెచ్చరికగా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -