టెక్నలజీతో పాటు అన్ని వేగంగానే వస్తున్నాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇండియాలోని యువత ఎక్కవుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ సర్వేలో తెలిందట. తాజాగా హాలీవుడ్ ఓ స్టార్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకోవాలని చూసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే…వరల్డ్ వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న గేమ్ థ్రోన్స్ సినిమా గురించి తెలియని వారండరు. ఈ సినిమా సిరీస్‌ను తెలుగులో కూడా డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో నటించిన సోఫి టర్నర్ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించదట.
గేమ్ థ్రోన్స్ సినిమా ద్వారా తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయింది సోఫి టర్నర్. అయితే కొన్నేళ్ల క్రితం ఒంటరిగా ఫీలయినట్లు చెప్పిన సోఫీ ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించదట. కొంతకాలం తన దగ్గరికి స్నేహితులు కూడా ఎవరు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవాలని చూసిందట. అయితే కారణం తెలియదు కాని ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో ఎందుకు అలా ప్రవర్తించాననేది ఇప్పటికి అర్థం కావడం లేదని ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది.
