Monday, April 29, 2024
- Advertisement -

మనకున్న అలవాట్లే డిప్రెషన్ కి కారణమా?

- Advertisement -

మీరు చాలా సందర్భాల్లో ఇరిటేషన్ కి గురవుతున్నారా ? ఉన్నట్టుండి తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారా ? అయితే మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవడానికి కొన్ని అలవాట్లు కారణమవుతాయి. మరి మీకున్న అలవాట్లే డిప్రెషన్ కి కారణమవుతున్నాయా ?

ప్రస్తుత రోజుల్లో డిప్రెషన్ చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారింది. అయితే డిప్రెషన్ కి కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని చెక్ చేద్దాం..

రోజంతా స్మార్ట్ ఫోన్స్ కి అతుక్కుపోవడం వల్ల డిప్రెషన్ కి గురవుతారని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటు అలసటకు గురిచేస్తుంది. ఆందోళన కలిగిస్తుంది.

కూర్చునే భంగిమ సరిగా లేకపోతే.. నెగటివ్ థాట్స్, డిప్రెషన్ కి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రెయిట్ గా కూర్చోవడం, స్ట్రెయిట్ గా నడవడం పాజిటివిటీని తెలుపుతుంది.

Also Read: ఈ పాపాలు చేస్తే.. నరకానికే వెళ్తారంటా!!

కెఫీన్ మీ మూడ్ ని కొంతవరకు మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల అది హానికారకం. కాబట్టి సరైన మోతాదులో తీసుకోవాలి.

డిప్రెషన్ కి ఇది ఒక కారణం. ఎక్కువ సమయంలో సోషల్ మీడిలో గడపడం వల్ల.. రియల్ లైఫ్ లో మనుషులతో తక్కువగా మాట్లాడగలుగుతారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతారు.

ఎమోషనల్ గా ఇబ్బందికి గురిచేసే వాళ్లతో రిలేషన్ లో ఉండటం వల్ల.. మీరు డిప్రెషన్ కి లోనవుతారు. మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆందోళనకు కారణమవుతుంది.

స్మోకింగ్ డిప్రెషన్ కి కారణమవుతుందని.. నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ వల్ల కొన్ని నరాలు సరిగా పనిచేయవు. కాబట్టి ఇది డిప్రెషన్ కి కారణమవుతుంది.

సమ్మర్ వెదర్ కూడా డిప్రెషన్ కి కారణమవుతుంది. డిప్రెషన్ లక్షణాలు ఉన్నవాళ్లలో.. సమ్మర్ వల్ల డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు ఎక్కువ.

అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోలేక పోవడం వల్ల డిప్రెషన్ కి గురవుతారు. అలాగే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గేకొద్దీ.. డిప్రెషన్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

Also Read: ఇలా ఐదు బుధవారాలు చేస్తే… మీ కోరికలన్నీ తీరుతాయట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -