Tuesday, June 18, 2024
- Advertisement -

దేవరలో రాజు యాదవ్!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈ విషయాన్ని శ్రీనే స్వయంగా వెల్లడించారు.

తాను హీరోగా చేస్తున్న రాజు యాదవ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దేవర సినిమాలో ఓ పాత్ర చేశానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నటన బాగుందని,సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -