‘ఢీ’ షోలో ర‌చ్చ చేసిన గెట‌ప్ శీను

- Advertisement -

ప్రముఖ ఈ టీవీ ఛానెల్లో ప్ర‌సార‌మయ్యే ఢీ షోకి ఎంత‌టి పాపుల‌రిటీ ఉందో అంద‌రికి తెలిసిందే.గ‌త 10 సంవ‌త్సరాలు పైగా ప్ర‌సార‌మవుతున్న ఈ షోకి విప‌రీత‌మైన రేటింగ్స్ వస్తున్నాయి.ఢీ షో ప్ర‌తి వారం యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది.ఢీ షో ప్ర‌తివారం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్‌లో ఉంటుందంటే,దీనికి ఎంత‌టి ఆద‌ర‌ణ ఉందో అర్థం చేసుకోవాలి. ఈ సీజ‌న్‌లో ప్ర‌స్తుతం ఢీ జోడీ న‌డుస్తుంది.తాజాగా ఢీ జోడి వ‌చ్చే వారం ప్రొమోని విడుద‌ల చేశారు.ఈ ప్రొమోలో జ‌బ‌ర్థ‌స్త్ ఆర్టిస్ట్ గెటప్ శీను ఓ పాట‌కు డ్యాన్స్ వేశాడు.

మామూలుగానే ర‌చ్చ చేసే గెట‌ప్ శీను డ్యాన్స్ షో అంటే ఇంకా వేరే చెప్పాలా అనే విధాంగా చేశాడు.గెట‌ప్ శీను డ్యాన్స్ వేస్తున్నంత సేపు అక్కడ యాంక‌ర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌తో పాటు జ‌డ్టీలుగా ఉన్న శేఖ‌ర్ మాస్టర్‌,జానీ మాస్ట‌ర్‌,ప్రియ‌మ‌ణిలు లేచి ,నుంచోని మ‌రి అత‌ని డ్యాన్స్‌ని ఆస్వాదించారు.ఇక గెట‌ప్ శీను త‌న‌దైన మ్యాన‌రిజంతో తెగ హ‌డావిడి చేశాడు.గెట‌ప్ శీను వ‌చ్చే వారం ఎపిసోడ్‌కే హైలెట్ కానున్నాడ‌ని ప్రొమోని చూస్తే అర్ధం అవుతుంది.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...