ఎన్నిక‌ల ప్ర‌చారంలో భార్య టీఆర్ఎస్‌…భ‌ర్త మ‌హాకూట‌మివైపు

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భార్య టీఆర్ఎష్ త‌రుపున ప్ర‌చారం చేస్తుంటే..భ‌ర్త మాత్రం మ‌హాకూట‌మి అనుకూలంగా స‌ర్వేలు ఇస్తున్నారు. వాళ్లు ఎవ‌రో వ‌కాదు స‌ర్వేల రారాజు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఆయ‌న స‌తీమ‌ని ప‌ద్మ‌. ల‌గ‌డ‌పాటి సతీమ‌ణి ప‌ద్మ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

దానం నాగేందర్‌ అన్నను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. గతంలో పాలించిన ఏ ప్రభుత్వమూ చేయనంత అభివృద్ధిని టీఆర్ఎస్ చేసి చూపిందని, మరో పదేళ్లలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

- Advertisement -

ఖైరతాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ ‌ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. లగడపాటి రాజగోపాల్ సర్వేను చంద్రబాబునాయుడు, ఇద్దరు మీడియా అధిపతులు మార్చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలకు లగడపాటి కూడ కౌంటర్ ఇచ్చారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...