Saturday, May 11, 2024
- Advertisement -

ప్రేక్ష‌కుల‌ను తిట్టేసిన సూప‌ర్‌స్టార్ అక్క‌

- Advertisement -

సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చడానికి అప‌సోపాలు ప‌డుతుంటారు. తాము అష్ట‌క‌ష్టాలు ప‌డి తీసిన సినిమాకు ప్రేక్ష‌కులను రప్పించుకోవ‌డానికి వారికి త‌ల‌కు మించిన భారం. అందుకే వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి సినిమా వాళ్లు చాలా క‌ష్టాలు ప‌డ‌తారు. మంచి సినిమా .. మీ అంద‌రికీ న‌చ్చుతుంది.. చూడండి.. అని బ‌తిమిలాడుతుంటారు. సినిమాకు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించేందుకు నానా తంటాలు ప‌డుతుంటే ఈమెమో ప్రేక్ష‌కుల‌ను తిట్టేస్తోంది. తాను సినిమా న‌చ్చ‌కుంటే వాళ్లు వేస్ట్ ఫెల్లోస్ అని తిట్టిపారేసింది. ఆమె ఎవ‌రో ఒక సూప‌ర్ స్టార్ హీరోకు అక్క కూడా. ఇంత‌కు ఏమ‌య్యిందంటే…

సూప‌ర్‌స్టార్ కృష్ణ కుమార్తె, ప్రిన్స్ మ‌హేశ్‌బాబు అక్క మంజుల ఓ సినిమా తీసింది. తన ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిశ‌న్‌, అమైర ద‌స్తూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘మనసుకు నచ్చింది’ సినిమా తీసింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌ను తిట్టేశారు.

కానీ మహేష్ సోదరి మంజుల.. మనసుకు నచ్చింది సినిమా ఎవరికైనా నచ్చకుంటే వారు వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసింది. అయితే ఫైనల్ గా సినిమా అయితే ఎవరికి నచ్చదో వారి వేస్ట్ ఫెలోస్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలు తీయ‌డం మీ వంతు… అంతేగానీ సినిమాలు చూడ‌క‌పోవ‌డం.. చూసినా న‌చ్చ‌క‌పోతే ప్రేక్ష‌కుల ఇష్టం. అంతేగానీ ప్రేక్ష‌కుల‌ను తిట్ట‌డం స‌రికాద‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -