Sunday, May 19, 2024
- Advertisement -

ఛ‌లో హీరో ‘గురువారం మార్చ్ ఒకటి’

- Advertisement -

చాలా రోజుల త‌ర్వాత కుర్ర న‌టుడికి మంచి విజ‌యం అంద‌డంతో త‌ర్వాత ప‌రమానందంలో ఉన్నాడు. ఇప్పుడు త‌న త‌ర్వాతి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు. అయితే త‌ర్వాతి సినిమాకు ఒక క్యాచీ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా ఏంటి.. ఆ హీరో ఎవ‌రు? టైటిల్ అనుకుంటున్నారా? చ‌ద‌వండి.

సీనియ‌ర్ న‌టుడు కాశీ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య ఓ సినిమా చేస్తున్నాడు. గ‌తంలో కాశీ విశ్వ‌నాథ్ త‌రుణ్‌తో తీసిన నువ్వు లేక నేను లేను సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు చేశాడు. ఆ త‌ర్వాత కాశీ విశ్వ‌నాథ్ న‌టుడిగా బిజీ అయిపోవ‌డంతో త‌ర్వాత సినిమాలు తీయ‌లేదు. ఇప్పుడు దాదాపు ప‌దిహేన్నేళ్ల‌కు ఓ సినిమా తీస్తున్నాడు.

ఇటీవ‌ల చ‌లో సినిమాతో విజ‌యం అందుకున్న కుర్ర న‌టుడు నాగ‌శౌర్య‌తో క‌లిసి ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా టైటిల్ డిఫ‌రెంట్‌గా ఉంది. మ‌హేశ్‌బాబు న‌టించిన దూకుడు సినిమాలో గురువారం మార్చి ఒక‌టి అనే పాట ఉందిగా. అదే పాట‌ను టైటిల్‌గా ఫిక్స్ చేశారు.

ఒక సీనియ‌ర్ న‌టుడి ద‌ర్శ‌కత్వంలో సినిమా చేయ‌డానికి నాగశౌర్య ఒప్పుకున్నాడంటే ఏదో విష‌యం ఉండే ఉంటుంది. దాదాపు వంద సినిమాలు చేసిన కాశీ విశ్వ‌నాథ్ కుర్ర హీరోతో సినిమా ఒప్పించారంటే గ్రేట్‌. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌కు చేరుకుంటోంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల అనంత‌రం సినిమాను ప్రారంభించ‌నున్నారు.

లంకెబిందెలు సినిమాకు విజయనిర్మల ద‌గ్గ‌ర కాశీ విశ్వ‌నాథ్‌ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఈ సినిమాను సురేశ్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించింది. ఆ త‌ర్వాత అదే సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాలకు అదే పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత త‌రుణ్‌తో తీసిన సినిమాతో దర్శకుడిగా పరిచయమై రెండు, సినిమాలు చేసిన అనంత‌రం న‌టుడిగా బిజీ అయ్యారు. కాశీ విశ్వ‌నాథ్ దర్శకుడు శ్రీవాస్ కజిన్ అవుతాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -