ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ తన ప్రభాస్ అభిమానులకు కానుకను ఇవ్వబోతున్నాడు. దీనిపై ఇప్పటికే ఒక క్లారిటీ ఇస్తూ.. పోస్ట్ కూడా చేసేశారు. ఆ గిఫ్ట్ ఏంటంటే.. తన కొత్త సినిమా అయిన రాధేశ్యామ్ కు సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
ఈ నెల 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ఈ గిఫ్ట్ ను రివీల్ చేయనున్నారు. గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఈ స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నట్లు సినిమా బృదం తెలిపింది. ఈ విషయాన్ని తెలిసేలా ఆ సినిమా బృదం ఒక పోస్టర్ ను కూడా ఇప్పటికే విడుదల చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడెప్పుడు ఆ విడియో రాబోతుందా అని వేచి చూస్తున్నారు.
అయితే దీనికి తాలుక పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ జేబులో చేతులు పెట్టుకొని స్టైల్‌గా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ లుక్ ఎంతో కూల్‌గా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఆనంద పడుతున్నారు.ఈ సినిమాను జిల్ రాధాకృష్ణ రూపొందిస్తున్నారు. ఇందులో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్. గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారో లేదో వేచి చూడాలి.
‘మహాసముద్రం’ పవర్‌ఫుల్ లుక్‌లో జగపతిబాబు
డబ్బే మనది కుమ్మేస్కో అంటున్న కాజల్.. మంచు విష్ణు !
‘ఉప్పెన’ బ్యూటీతో యంగ్ టైగర్ రోమాన్స్ !