Friday, April 26, 2024
- Advertisement -

‘మ‌హాస‌ముద్రం’ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో జ‌గ‌ప‌తిబాబు

- Advertisement -

‘మ‌హాస‌ముద్రం’లో జ‌గ‌ప‌తి జ‌గ్గూభాయ్ అద‌ర‌గొట్టేస్తున్నాడు. మాస్‌.. ర‌ఫ్ లుక్‌లో క‌నిస్తుస్తూ.. తెగ ఆస‌క్తిని రేపుతున్నాడు. వివ‌రాల్లోకెళ్తే.. టాలీవుడ్‌ సూప‌ర్ హిట్ మూవీ ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తాజాగా తెర‌కెక్కిస్తున్న సినిమా మ‌హాస‌ముద్రం. ఇందులో యంగ్ హీరో శ‌ర్వానంద్ తోపాటు సిద్ధార్థ్‌లు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. అలాగే, ప్రముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

నేడు జ‌గ‌ప‌తిబాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమా యూనిట్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో జ‌గ‌ప‌తి బాబు లుక్ అదిరిపోతోంది. ర‌ఫ్ లుక్‌లో క‌నిపిస్తున్న ఆయ‌న ఇందులో విల‌న్ పాత్ర పోషిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. సినిమా యూనిట్ సైతం జ‌గ్గూభాయ్ మ‌హాస‌ముద్రంలో చుంచు మామ అనే పాత్ర పోషిస్తున్నార‌ని ప్ర‌క‌టించింది. అలాగే, చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో సిద్ధార్థ్ సినిమా చేస్తుండ‌టంతో మ‌హాస‌ముద్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇాటీవల మహాసముద్రం సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల అయింది. అది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఇక జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం.. అందులో ఆయ‌న ప‌వర్‌ఫుల్ ర‌‌ఫ్‌లుక్‌లో క‌నిపిస్తుండ‌టం సినిమాపై మ‌రింత‌గా అంచ‌నాలు పెరిగాయి. కాగా, ఈ సినిమాలో అదితి రావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో అంటున్న కాజ‌ల్.. మంచు విష్ణు !

సరిగా నిద్రపోవడం లేదా..? అయితే మీకు.. !

‘ఉప్పెన’ బ్యూటీతో యంగ్ టైగ‌ర్ రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -