- Advertisement -

వన్ మ్యాన్ షో.. ‘పెద్ది’!

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచిబాబు సానా దర్శకత్వంలో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ‘గేమ్‌ఛేంజర్’ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడం, తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని ఆయన ముందే ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం థియేటర్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సోషల్ మీడియాలో ‘పెద్ది’ చిత్రంపై విపరీతమైన బజ్ నడుస్తోంది. 1990ల నాటి నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సామాన్యుడు తన ఊరి ఆత్మగౌరవం కోసం, ఒక రైల్వే స్టేషన్ సాధించడం కోసం క్రికెట్, కుస్తీ (రెజ్లింగ్) మరియు రన్నింగ్ క్రీడల నేపథ్యంలో సాగించిన భావోద్వేగ పోరాటం ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఈ సినిమాకు మేజర్ అస్సెట్ రామ్ చరణ్ ‘వన్ మ్యాన్ షో’ అని చెపుతున్నారు. చరణ్ తన ఊరమాస్ లుక్, బాడీ లాంగ్వేజ్, రోమాంచిత యాక్షన్ సీక్వెన్స్‌లతో స్క్రీన్‌ను పూర్తిగా డామినేట్ చేశాడనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్, హై-వోల్టేజ్ యాక్షన్స్, రన్నింగ్ సీజీ (CG) వర్క్ అద్భుతంగా కుదిరాయని ఆడియన్స్ కొనియాడుతున్నారు. దీనికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోందని, సినిమాటోగ్రఫీ విజువల్స్ పీరియాడిక్ మూడ్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశాయని టాక్ వస్తోంది. కథలో బోమన్ ఇరానీ నరేషన్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఎంట్రీ, జగపతి బాబు పాత్ర చుట్టూ వచ్చే ట్విస్టులు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

అయితే, కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా సోషల్ మీడియా వేదికగా డిస్కషన్స్ లోకి వస్తున్నాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ మాస్ కథ కాకపోవడం, కొన్ని చోట్ల ఓవర్ డ్రామాటిక్ సీన్లు ఉండటం వల్ల సాధారణ మాస్ ఆడియన్స్‌కు కొంత ల్యాగ్ అనిపించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే గ్లామరస్ హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం, కథ అంతా చరణ్ చుట్టూనే తిరగడంతో హీరోయిన్ క్యారెక్టర్‌ను కాస్త తక్కువగా డిజైన్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, బుచిబాబు సానా రాసుకున్న స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్, రామ్ చరణ్ విశ్వరూపం కారణంగా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సాలిడ్ రన్ కొనసాగించడం ఖాయమని, మెగా ఫ్యాన్స్‌కు ఇదొక పర్ఫెక్ట్ థియేట్రికల్ ట్రీట్ అని సోషల్ మీడియా విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -