డైరెక్టర్ శంకర్ తన మొదటి సినిమాతోనే తానేంటో నిరుపించుకున్నాడు. శంకర్ సినిమా అంటే సామాజిక అంశంతో పాటు,భారీతనం కూడా తన సినిమాలో ఖచ్చింతగా ఉండేలా చూసుకుంటాడు. తను అనుకున్నది వచ్చేంత వరకు ఎంత వరుకు అయిన వెళ్తాడు శంకర్. అలా తీస్తాడు కాబట్టే శంకర్ సౌత్‌లో నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలిచారు. శంకర్ దర్శకత్వం వహించిన రోబో 2.0 ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక శంకర్ ఈ సినిమా తరువాత లోకనాయకుడు కమల్ హాసన్‌తో భారతీయుడు సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల్లో సెట్ కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ శంకర్ సెట్ మొత్తాన్ని గోల్డ్ కలర్ తో నింపబోతున్నాడట. ఈ సెట్ మొత్తం బంగారు తళతళలతో ఉంటుందని తెలుస్తోంది. ఈ మెటీరియల్ మొత్తం చైనా నుండి దిగుమతి చేస్తున్నారట. బంగారంతో నిర్మించిన సెట్ లా కనిపించడం కోసం మెటీరియల్ కోసం చైనా సంస్థలకు ఆర్డర్ ఇచ్చారట. ఇంతా చేస్తున్న ఈ సెట్ లో షూటింగ్ రెండు రోజులే నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ సెట్‌లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రికరించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?