Friday, May 3, 2024
- Advertisement -

గుంటూరు కారం…దసరా ట్రీట్!

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. దసరాకి సినిమాలోని సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇది మెలోడి సాంగ్ అని తెలుస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్‌కు సంబంధించిన న్యూస్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుంటూరు నగరంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు పనిచేస్తున్న లేడీ జర్నలిస్టుతో ఆ నగరంలో గుంటూరు కారం అంతటి ఘాటైన యువకుడు ఆమె ప్రేమలో పడడం, అనంతరం విలన్స్ కి ఎదురుతిరగడం అనే కథాంశంతో ఈ మూవీ సాగుతుందట.

చాలా కాలం తర్వాత మాస్ పవర్‌ఫుల్ పాత్రలో కనించనున్నారు మహేష్. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో స్టోరీ, స్క్రిప్ట్, సాంగ్స్ ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నార త్రివిక్రమ్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -