Wednesday, May 15, 2024
- Advertisement -

ఉప్పల్‌లో సెంచరీల మోత..లంకను చిత్తుచేసిన పాక్

- Advertisement -

సెంచరీల మోతతో ఉప్పల్‌లో పరుగుల వరద పారింది. శ్రీలంక విధించిన భారీ టార్గెట్‌ను ఊఫ్ మంటూ ఉదేసింది పాకిస్థాన్. 345 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 48.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసియా కప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది పాక్.

రిజ్వాన్‌ 121 బంతుల్లో 131 పరుగులతో నాటౌట్‌గా నిలవగా షఫీక్‌ 103 బంతుల్లో 113 పరుగులతో రాణించారు. ఆదిలోనే ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (12).కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (10) వికెట్ కొల్పోయినా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు రిజ్వాన్, షఫీక్. ఇద్దరు సెంచరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లంక బౌలర్లు ఎంత ప్రయత్నించినా వీరిద్దరి జోడిని విడగొట్టడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచి బ్యాటిగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో కుశాల్ పెరీరా డకౌట్‌ అయినా కుశాల్ మెండీస్ మాత్రం పాక్ బౌలర్లపై విరుచుకపడ్డాడు.40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మెండిస్ మరో 25 బంతుల్లోనే అంటే 65 బంతుల్లో సెంచరీ పూర్తిచేసి వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన శ్రీలంక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.కుశాల్‌కు తోడుగా సమరవిక్రమ (108) పరుగులతో రాణించడంతో లంక భారీ స్కోరు సాధించింది. రిజ్వాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఇప్పటివరకు ఓడిపోలేదు పాకిస్థాన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -