Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీదేవి బ‌యోపిక్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాల‌న్‌

- Advertisement -

తెర‌పై బ‌యోపిక్‌ల హ‌వాకొన‌సాగుతోంది. శ్రీదేవి జీవిత చ‌రిత్రపై సినిమా వ‌స్తుందంటూ ర‌క‌ర‌కాల‌ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మ‌రోసారి శ్రేదేవి బ‌యోపిక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌టింస్తుంద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌స ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాల‌న్ న‌టించింది. డర్టీ పిక్చర్ సినిమాలో నటించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తోనే అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్‌ తీసే అవకాశముందని బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఓ అంగ్ల దినపత్రికతో అన్నారు. శ్రీదేవి బతికున్నప్పుడు ఆమెతో సినిమా కోసం ఓ కథను సిద్ధం చేశానని, అయితే అది సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. వెండితెరపై మరో శ్రీదేవి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు సరైన నటి తనకు దొరికితే సినిమా చేసి దానిని శ్రీదేవికే అంకితం చేస్తానని మెహతా అన్నారు. ఆమె జీవితంపై తాను కచ్చితంగా ఓ సినిమా చేయగలనని, ఇందుకోసం తన మదిలో కొందరు హీరోయిన్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -