కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం తీర్మానం పెట్టడంతో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడంతో భాజాపా అయోమయంలో పడింది. దీంతో భాజాపా జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై నేతలతో అమీత్‌షా చర్చించినట్లు తెలుస్తోంది.
అమీద్‌షాతో సమావేశం తర్వాత భాజాపా నేతలు టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో పలు పార్టీలు ప్రజల భావోద్వేగాలని ప్రేరేపిస్తున్నాయని, కానీ, హోదా స్థానంలో అందుకు సమానమైన ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. మ పార్టీ జాతీయాధ్యక్షుడితో కూర్చొని ఏపీ రాజకీయ అంశాలపై చర్చించామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ప్రయోజనాలను గురించి వివరించాలని తాము నిర్ణయించుకున్నామని కంభంపాటి హరిబాబు తెలిపారు. పోలవరం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని అన్నారు. ఏపీలో బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని జరిపి ప్రజల్లోకి ఎలా వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాయితీలు ఇచ్చిందని అన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొడతామని తెలిపారు. ఎవరూ అడగకుండానే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. మా జరుగుతున్ దుస్ప్రచారాన్ని తిప్పికొడతమాని తెలిపారు.
