Thursday, May 23, 2024
- Advertisement -

అతడికి పడిపోయిందిః హన్సిక మళ్లీ ప్రేమలో!

- Advertisement -

మొన్నటి వరకూ హన్సిక, శింబుల ప్రేమ వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. ప్లేబాయ్ ఇమేజ్ ను కలిగిన శింబుతో హన్సిక ప్రేమలో పడింది..

వారిద్దరూ కొన్ని రోజులు లవ్ లైఫ్ లోఉన్నారు.

అయితే అంతలోనే వారికి బ్రేకప్ అయ్యింది. తనను హన్సిక వదిలి పెట్టి వెళ్లిందని శింబు బాధపడ్డాడు. ఇక హన్సిక కూడా అతడితో ప్రేమ జీవితం గురించి తన దగ్గర ప్రస్తావించవద్దని అంటోంది.

ఇదే సమయంలో హన్సిక గురించి మరో ప్రేమ కథ ప్రచారంలోకి వచ్చింది. ఆమె ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ సారి కూడా హన్సిక ఒక హీరోతోనే లవ్ లో ఉందని టాక్. ఇప్పుడు ఆమె ప్రేమిస్తున్నవ్యక్తి పేరు “జయం రవి”. తమిళంలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో!

“జయం” సినిమా తమిళ వెర్షన్ తో తెరకు పరిచయం అయిన ఇతడు నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు. 

హన్సిక, రవిలిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ పాత పరిచం ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ ను పెంచిందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా ధ్రువీకరణ లేదు. 

ఈ విషయాన్ని హన్సిక లేదా జయం రవిలు ధ్రువీకరిస్తే కానీ దీనిపై క్లారిటీ రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -