Wednesday, May 15, 2024
- Advertisement -

షాక్ తినేదెవ్వరు: టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ లలో దెబ్బతినేదెవ్వరో!

- Advertisement -

వరసగా ఎమ్మెల్యేలను కోల్పోతున్న తెలుగుదేశం పార్టీకి మరో చావుదెబ్బ పడుతుందా? నేతల మధ్య సఖ్యతలేని కాంగ్రెస్ కు షాక్ తగులుతుందా? లేక ఓవర్ కాన్ఫిడెన్స్ తో లేని బలాన్ని ఊహించుకొని బరిలోకి దిగిన తెరాసకు దిమ్మతిరుగుతుందా?

కేసీఆర్ కు గట్టి ఎదురుదెబ్బ పడుతుందా?! తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుల ఎన్నిక ఆసక్తికరంగా మారిందిప్పుడు.

మొత్తం ఆరు సీట్లకు ఏడు మంది అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఎన్నికలో విజేతలు ఎవరో.. పరాజితులుగా దెబ్బతినేదెవ్వరో అనేది ఆసక్తికరంగా మారింది.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగు సీట్లను సొంతం చేసుకోగలదు. అయితే బలం లేకపోయినా ఆ పార్టీ ఐదో అభ్యర్థిని బరిలో నిలిపింది. ఈ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తనవైపుకు తిప్పుకొనే ప్రయత్నంలో ఉంది. తెరాస టార్గెట్ ప్రధానంగా టీడీపీనే. దీంతో తమబలానికి దక్కాల్సిన సీటును దక్కించుకోవాల్సిన తెలుగుదేశంపార్టీకి ఎదురుదెబ్బ తగలదేమోననే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక కాంగ్రెస్ ది మరో వ్యథ. ఈ పార్టీకి బలం ఉన్నప్పటికీ వారి మధ్య ఐక్యత లేదు. వారందరూ ఉమ్మడిగా నిలిచి సొంత పార్టీ అభ్యర్థిని గెలిపించుకొంటారనే నమ్మకం లేదు. దీంతో కాంగ్రెస్ ఓట్లు చీలి.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతాడేమో అనే అనుమానాలూ ఉన్నాయి. 

కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల్లో ఏదో ఒకటి షాక్ తిని.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే అదో కథ. అయితే తెరాస కూడా సేఫ్ జోన్ లో ఏమీ లేదు. ఈ పార్టీ అధినేత ఐదో అభ్యర్థి ని గెలిపించుకోవడంపై విశ్వాసంతోనే ఉన్నా.. తెరాసకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాకిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి అదే జరిగితే.. కేసీఆర్ కు అంతకు మించిన షాక్ ఉండదేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -