Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో హ‌న్సిక‌..ఏ పాత్ర కోస‌మో తెలుసా..?

- Advertisement -

హీరోయిన్ హ‌న్సిక‌కు త‌మిళంలో ఓ స్టార్ హీరోకి ఉన్నంత ఇమేజ్ ఉంది.ఎప్ప‌టి నుంచే అక్క‌డ అగ్ర క‌థ‌నాయిక‌గా కొన‌సాగుతుంది హ‌న్సిక‌.అక్కడ చాలా బిజీగా ఉండటం వల్లనే ఈ సుందరి తెలుగు సినిమాలను పెద్దగా చేయలేకపోయింది. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా హన్సిక తెలుగు సినిమాలు చేస్తునే ఉంది.తాజాగా ఆమెకు తెలుగులో మ‌రో అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.ఆమెకి ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ వచ్చినట్టుగా సమాచారం.జయప్రద పాత్ర కోసం హన్సికను టెస్ట్ చేసిన క్రిష్ .. ఆమెను ఓకే చేశాడని చెబుతున్నారు.

ఇంతకుముందు జయప్రద పాత్ర కోసం తమన్నాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ పాత్రకు హన్సికను ఫిక్స్ చేసేశారని అంటున్నారు. ఇప్పటికే శ్రీదేవిగా రకుల్ .. సావిత్రిగా నిత్యామీనన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -