Wednesday, May 8, 2024
- Advertisement -

అఖిల్‌కు రామ్ చ‌ర‌ణ్ అయిన హిట్ ఇస్తాడా..?

- Advertisement -

అక్కినేని న‌ట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అనుకున్నంత స‌క్సెస్ కాలేదు .మొద‌టి సినిమా అఖిల్ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా ఫెయిల్ అయింది.ఒక రెండో సినిమా హ‌లో కూడా యావ‌రేజ్‌గానే ఆడింది.దీంతో ఎలాగైన హిట్ కొట్ట‌ల‌నే క‌సితో ఉన్న అఖిల్ ప్ర‌స్తుతం తొలిప్రేమ ద‌ర్శ‌కుడితో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ల‌వ్ స్టోరీ కావ‌డంతో త‌ను అనుకున్న మాస్ ఇమేజ్ ఈ సినిమాతో రాదని బాధ‌ప‌డుతున్న త‌రుణంలో అఖిల్‌కు శుభవార్త చెప్పాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.తనతో ప్రస్తుతం సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ కు ఓ సినిమా సెట్ చేసారట.

అలాగే నిర్మాత గానూ తనే ఉంటానని ..చెప్పి అఖిల్ కు యాక్షన్ స్టోరీ రెడీ చేయమని పురమాయించాడట. దాంతో ఇప్పటికే బోయపాటి ఓ స్టోరీ లైన్ ని అఖిల్ కు చెప్పి ఓకే చేయించుకున్నారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. 2019లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. వచ్చే సంవత్సరం చివర్లో రిలీజ్ కు వెళ్తుంది. మ‌రి అఖిల్‌కు రామ్ చ‌ర‌ణ్ అయిన హిట్ ఇస్తాడో లేక నితిన్‌లా చేతులు కాల్చుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -