Tuesday, May 7, 2024
- Advertisement -

200 కోట్ల క్లబ్‌లో.. హను మాన్

- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డులను తిరగరాస్తోంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాగా విడుదలైన తొలి రోజు నుండే పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది. విడుదలైన 10 రోజుల్లో 200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టటింది. లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హనుమాన్ హిట్ కావడంతో జై హనుమాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -