Monday, April 29, 2024
- Advertisement -

టెన్షన్‌లో శ్రీకాకుళం టీడీపీ నేతలు!

- Advertisement -

ఏపీ టీడీపీ ఫస్ట్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది. దాదాపు 73 మందితో ఫస్ట్ లిస్ట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోండగా ఎవరికి సీటు దక్కుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల్లో టెన్షన్ తారా స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో ఎమ్మడి శ్రీకాకుళంలోని 10 స్థానాల్లోని 8 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ. ఒక టెక్కలి, ఇచ్చాపురం తప్ప మిగితా అన్ని స్థానాల్లో ఓటమి పాలైంది.

అయితే ఈ సారి ఎలాగైనా శ్రీకాకుళం జిల్లాలో పట్టు సాధించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎలాగైన సీటు దక్కించుకుని పోటీ చేయాలని చాలా మంది నేతలు భావిస్తున్నారు. నేతలంతా చంద్రబాబు ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుండగా బాబు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయోనని కేడర్ సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత నేతలే ప్రస్తుతానికి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా కొనసాగుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొత్త నాయకులు ఉండగా వారు సైతం సీట్లు ఆశీస్తుండటం చంద్రబాబుకు కొత్త సమస్య తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే జనసేనతో పొత్తులో కొంతమంది సీనియర్ నేతలకు సీటు ఇవ్వలేకపోతుండటంతో వారిని బుజ్జగించేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుండి కిమిడి కళా వెంకట్రావ్ వర్సెస్ కలిశెట్టి అప్పలనాయుడు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జిగా జి.లక్ష్మీదేవి ఉండగా గోండు శంకర్ కూడా సీటు ఆశీస్తున్నారు. అలాగే పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట రమణ వర్సెస్ మామిడి గోవింద్ సీట్లు ఆశీస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో గెలుపు, ఓటముల సంగతి పక్కనపెడితే పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపిసస్తుండటం విశేషం. అయితే చంద్రబాబు ఎవరికి సీటు కేటాయిస్తారో తెలియక నేతలు టెన్షన్‌కి గురవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -