Wednesday, May 1, 2024
- Advertisement -

వైఎస్ జగన్ ను అభిమానించే హీరోయిన్ పెళ్లికి రెడీ..!

- Advertisement -

పొలిటీషియన్ గా వైఎస్ జగన్ కు సెలబ్రిటీల్లో కూడా బాగానే క్రేజ్ ఉంది. సినిమా వాళ్లుకూడా పొలిటికల్ పరిణామాల గురించి స్పందిస్తూ తమ అభిమానాలను అప్పుడప్పుడు చాటుకొంటూ ఉంటారు.

ఈ రకంగా హీరోయిన్ హరిప్రియ ఒకసారి మాట్లాడుతూ.. తను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అభిమానినిని అని చెప్పుకొంది. వైకాపా అధినేతపై ఆ విధంగా తన అభిమానాన్ని చాటుకొంది!

తెలుగులో చాలా సినిమాలు చేసినా సరైన బ్రేక్ లభించలేదు ఈ హీరోయిన్ కి. ‘పిల్లజమీందార్’ వంటి పర్వాలేదనిపించుకొనే సినిమాలుచేసినా.. హరిప్రియకు లక్ కలిసి రాలేదు. అవకాశాలు వెల్లువెత్తలేదు. ఇప్పుడు ఈ భామ కన్నడలో ఏవో సినిమాలు చేసుకొంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె గురించి ఇప్పుడొక రూమర్ మొదలైంది. ఈమె ఒక కన్నడ హీరోతో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. తను త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి.

వీరిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారని తెలుస్తోంది. మరి ఈ విషయం గురించి హరిప్రియ ధ్రువీకరించలేదుకానీ.. రూమర్లు అయితే వినిపిస్తున్నాయి! మరి అసలు కథ ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -