- Advertisement -
సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హరోం హర. తొలుత ఈ సినిమాని మే 31న విడుదల చేస్తామని ప్రకటించగా ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో మాళవిక శర్మ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ విడుదల కానుంది.
అయితే కొన్ని కారణాల వల్ల జూన్ 14కి వాయిదా పడినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్‌లో సుదీర్ బాబు చేతిలో గన్ పట్టుకుని నడుస్తుండగా వెనుక మంటలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించారు.