Thursday, April 25, 2024
- Advertisement -

శ్రీదేవి సోడా సెంటర్ ప్రారంభమయ్యేది ఆ రోజే..!

- Advertisement -

యువ హీరో సుధీర్ బాబు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు. కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఎవరి అండ లేకుండా సొంతంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన వీ, నన్ను దోచుకుందువటే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేశాడు.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడం, వరుసగా సినిమాలు విడుదల అవుతుండడంతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పల్లెటూరి యువకుడిగా సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Also Read

కాస్కోండి.. మొదలైంది సినిమాల జాతర..!

దేశంలోనే ఐఏఎస్ టాపర్స్.. ప్రేమించి మతాంతర వివాహం.. చివరికిలా..!

19న థియేటర్లలోకి ‘రాజ రాజ చోర’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -