Sunday, May 5, 2024
- Advertisement -

ఈ ఏజ్ లో ఇంతటి రిస్క్ చేయక తప్పదా

- Advertisement -

హర్షవర్దన్ . బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి. 25 సంవత్సరాలకు పైగా నటనానుభవం ఉన్న హర్ష ఇష్క్.. గుండె జారి గల్లంతయ్యిందే.. మనం.. 24 లాంటి సినిమాలతో రచయితగాను నిరూపించుకున్నాడు.నటుడిగా,రచయితగా నిలబెట్టుకున్న హర్ష ఇప్పుడు పెద్ద స్టెప్పే వేస్తున్నాడు. అదే డైరెక్షన్ చేపట్టడం. తనకు ఇప్పటి వరకు వచ్చిన ఫేమ్ తో మెగా ఫోన్ పట్టాడు.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో దర్శకుడిగా మారిన హర్ష.. ఈసినిమాను ప్రమోట్ చేయడానికి ప్రోమోలు వదిలాడు. ‘ఎ హర్షవర్ధన్స్ మ్యూజికల్ నరేటివ్’ అంటూ పోస్టర్ మీద తననే సంగీత దర్శకుడిగా కూడా పరిచయం చేసుకున్నాడు. ఐతే మనోడిలో లారెన్స్ ,ఎస్ వి కృష్ణారెడ్డి తరహాలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటాడని ఎవ్వరూ ఊహించలేదు. తాజాగా ఈ సినిమాలోని ఒక పాటను లాంచ్ చేశాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే ఈ పాటను హర్షవర్ధనే స్వయంగా ఆలపించాడు. ఈ పాట విజువల్స్ చూస్తే సీనియర్ దర్శకుడు వంశీ గుర్తుకు వస్తున్నాడు.

బహుశా మనోడిపై ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. హీరోయిన్ గా చేసిన బుల్లితెర నటి శ్రీముఖిని అచ్చుగుద్దినట్లు… పెద్ద వంశీ సినిమాల్లో హీరోయిన్ గా చూపించాడు. అయితే ఈచిత్రంలో హీరోగా మల్లెపువ్వు ఫేం మురళీకృష్ణను తీసుకోవడం విశేషం.ఇదంతా బాగానే ఉంది కాని హర్ష చేస్తోన్న ఈ ప్రయోగం ఇతనికి డైరెక్టర్ గా ఎంత మైలేజ్ ఇస్తుందనేదే ఇక్కడ మాట్లాడుకోవల్సిన విషయం. అటు నటుడిగా ఇటు రచయితగా సక్సెస్ ఫుల్ రన్ అవుతోన్న హర్ష కెరియర్ ఈ ప్రయోగం వలన ఏమైనా దెబ్బ కొడుతుందా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -