Friday, April 26, 2024
- Advertisement -

ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఇంకా ఆశ చావలేదు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎంతో మంది హీరోలు తమ లక్ ని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి పరాజయం పాలైన వారు మళ్ళి ఇంకో సినిమా తో వచ్చే అవకాశం తక్కువ. వెనక మంచి స్ట్రాంగ్ ఆర్ధిక బాక్గ్రౌండ్ ఉంటె తప్ప అది జరగదు. అలా ఉంటె కనుక ఎన్ని పరాజయాలు వచ్చినా ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ప్రేక్షకులకి ఎలాగైనా అలవాటు అవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు హీరో హవీష్. అప్పుడెప్పుడో రవిబాబు దర్శకత్వం లో వచ్చిన నువ్విలా అనే సినిమా తో హీరో గా అరంగేట్రం ఇచ్చి ఓంకార్ దర్శకత్వం లో జీనియస్ అనే సినిమా చేసిన ఈ హీరో రెండు సినిమాల తో పరాజయ ఏ చవిచూశాడు.

ఆ తర్వాతా కూడా కొన్ని సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ప్రేక్షకులు అతడిని ఆదరించలేదు. ఇపుడు తాజా గా ఆయన మళ్ళి ఒక రొమాంటిక్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ అనే కొత్త యువకున్ని దర్శకుడి గా పరిచయం చేస్తున్నారు నిర్మాత. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా కి నిర్మాణ బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా కి చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -