Monday, May 13, 2024
- Advertisement -

ఆర్ఎక్స్ 100 క్రేజ్ మాములుగా లేదు!

- Advertisement -

ఆర్ఎక్స్ 100 సినిమా టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆక‌ర్షించింది ఈ సినిమా.ఈ సినిమా అంద‌రు కొత్త వాళ్లు అయిన్న‌ప్ప‌టికి సినిమాకు బాగానే ప‌బ్లిసిటీ వ‌చ్చింది.దీంతో సినిమాకు మొద‌టి రోజు ఓపినింగ్స్ బాగానే వ‌చ్చాయి.దీనికి తోడు సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో సినిమాకు క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయి.కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమాకు యూత్ బాగా క‌నెక్ట్ అవుతుంది.యూత్ మెచ్చే అంశాలు సినిమాలో ఎక్కువుగా ఉన్నాయి.రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ఫస్టు వీకెండ్ లోనే రెట్టింపు వసూళ్లను రాబట్టింది.

ఇక సినిమా శాటిలైట్ హ‌క్కుల కోసం ప‌లు టీవీ చానెల్స్ పోటీ ప‌డుతున్నాయి.ఈ సినిమాకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాత .. 6 కోట్ల వరకూ చెబుతున్నాడట.రేటు ఎక్కువుగా ఉన్న‌ప్పటికి సినిమా క్రేజ్‌ను బ‌ట్టి ఈ రేటు పెట్టాడనికి టీవీ చానెల్స్ రెడీగా ఉన్నాయ‌ని స‌మాచారం.ఇప్ప‌టికే లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ స్పెష‌ల్ బోన‌స్ అని చిత్ర నిర్మాత‌లు భావిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -