Tuesday, May 14, 2024
- Advertisement -

రియల్ లైఫ్‌లో లవ్ స్టోరీలు ఉన్నాయో లేదో తెలియదు

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరో , హీరోయిన్లుగా తెర‌కెక్కిన సినిమా ‘హలో గురు ప్రేమకోసమే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదారాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రామ్ మాట్లాడుతూ.. నా గొంతు బాలేదు పెద్దగా మాట్లాడలేను.

ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియడం లేదు. నేను దిల్ రాజు ఎప్పటి నుండో సినిమా చేయాలని అనుకుంటున్నాం.. ఇప్పటికి కుదిరింది. రియల్ లైఫ్‌లో లవ్ స్టోరీలు ఉన్నాయో లేదో తెలియదు కాని ఆయన మాత్రం ప్రతి సినిమాను చాలా ప్రేమిస్తారు. ద‌ర్శ‌కుడి గురించి మాట్లాడుతు ఆయన దర్శకుడిగా కంటే ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్‌ని మానిటర్‌లో చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. సీన్ నచ్చకపోతే వెంటనే నచ్చలేదనేస్తారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలన్నారు రామ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -